యూట్యూబ్ లో చూస్తూ ప్రసవం చేసుకున్న 17 ఏళ్ల అమ్మాయి.. ప్రియుడిపై పోక్సో కేసు
- కేరళలోని మళప్పురంలో ఘటన
- ప్రేమించుకున్న యువతీయువకులు
- 18 ఏళ్లు నిండాక పెళ్లి చేస్తామన్న పెద్దలు
- ఇంతలోనే గర్భం దాల్చిన యువతి
యూట్యూబ్ వీడియో చూస్తూ తనంతట తానే 17 ఏళ్ల ఓ అమ్మాయి ప్రసవం చేసుకున్న ఘటన కేరళలోని మళప్పురం పట్టణంలో చోటుచేసుకుంది. అక్టోబర్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆ అమ్మాయి ప్రేమికుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్ చదువుతున్న ఆ అమ్మాయి, 21 ఏళ్ల ఆమె ప్రియుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు.. 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేస్తామని వారికి నచ్చజెప్పారు. ఇంతలోనే ఆ బాలిక గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తల్లికి కళ్లు కనిపించకపోవడం, తండ్రి నైట్ వాచ్ మన్ కావడంతో తాను గర్భవతన్న విషయం ఇంట్లో వాళ్లకు తెలియలేదు. బిడ్డ ఏడ్పులు వినపడడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
వెంటనే తల్లీబిడ్డలను మంజేరిలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. యూట్యూబ్ లో చూసే ఆ అమ్మాయి బొడ్డుతాడును కూడా కత్తిరించుకుందని చెప్పారు. పోలీసులకు ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశారు.