ఇస్లాంకు, క్రికెట్ మ్యాచ్ లకు సంబంధం ఏమిటి?: పాక్ మంత్రిపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
- వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ విజయం
- ఇది ఇస్లాం సాధించిన విజయమన్న పాక్ మంత్రి
- పాక్ మంత్రిని పిచ్చివాడిగా అభివర్ణించిన ఒవైసీ
- ముజఫర్ నగర్ లో వ్యాఖ్యలు
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు గెలిచిన తర్వాత పాక్ మంత్రి రషీద్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారతదేశ ముస్లింలతో సహా, ఇతరదేశాల్లోని ముస్లింల మనోభావాలు పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో ముడిపడి ఉన్నాయని రషీద్ వ్యాఖ్యానించారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ, అసలు ఇస్లాంకు, క్రికెట్ మ్యాచ్ లకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు.
"టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం ఇస్లాం విజయం అని పొరుగుదేశపు మంత్రి చెబుతున్నాడు. ఆ మంత్రి ఓ పిచ్చివాడు కాబట్టే ఆవిధంగా ప్రేలాపనలు చేస్తున్నాడు. మన పెద్దవాళ్లు నాడు పాకిస్థాన్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు కాబట్టి సరిపోయింది... లేకపోతే ఇలాంటి పిచ్చి మంత్రులను మనం కూడా చూసేవాళ్లం" అంటూ భారతీయు ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యూపీలోని ముజఫర్ నగర్ లో ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.