రైతులను కారుతో తొక్కించిన చరిత్ర బీజేపీది: హరీశ్ రావు
- హుజూరాబాద్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక
- ముగిసిన ప్రచారం
- మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు
- సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని ధీమా
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. గోబెల్స్ ప్రచారంతో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్లలో తెలంగాణకు ఏంచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూడడం బీజేపీ నైజం అని అన్నారు. నిరసనలు తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడు కారుతో దూసుకెళ్లి వారి మరణానికి కారకుడయ్యాడని, అతడిపై ఇప్పటికీ చర్యలు లేవని హరీశ్ రావు ఆరోపించారు. రైతులను కారుతో తొక్కించిన చరిత్ర ఎవరిది? బీజేపీది కాదా? అని ప్రశ్నించారు.