నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. భారీగా పతనమైన యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ!
- 206 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 57 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- ఆరున్నర శాతం తగ్గిన యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 206 పాయింట్లు కోల్పోయి 61,143కి పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 18,210 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (4.43%), ఇన్ఫోసిస్ (1.29%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.19%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.09%), సన్ ఫార్మా (1.07%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-6.52%), బజాజ్ ఫైనాన్స్ (-4.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.85%),ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.69%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.61%).