నేటితో బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి తెర
- సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక
- డాక్టర్ దాసరి సుధకు టికెట్ ఇచ్చిన వైసీపీ
- అభ్యర్థులను బరిలో దించని టీడీపీ, జనసేన
- అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్
- ఈ నెల 30న పోలింగ్
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నేటితో ప్రచారానికి తెర పడనుంది. రాత్రి 7 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తెలిసిందే. వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు వైసీపీ టికెట్ ఇవ్వగా, ఆనవాయతీ ప్రకారం టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను బరిలో దించరాదని నిర్ణయించుకున్నాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ పనతల సురేశ్ కు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ కమలమ్మను బరిలో దించింది.