సెయింట్ ఆన్స్ స్కూల్ మూసివేయవద్దంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిని చుట్టుముట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు
- దిక్కుతోచని స్థితిలో ఎయిడెడ్ విద్యాసంస్థలు
- కాకినాడ, జగన్నాథపురం పాఠశాల పరిస్థితిపై విద్యార్థుల ఆందోళన
- ఎందుకు మూసివేస్తున్నారని నిలదీసిన వైనం
- స్కూలును కొనసాగించాలని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజాగా కాకినాడలోని జగన్నాథపురం సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చుట్టుముట్టారు. స్కూలు మూసివేస్తే పిల్లలు ఇబ్బందిపడతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
సెయింట్ ఆన్స్ స్కూల్లో ఎంతో చక్కగా విద్యాబోధన చేస్తున్నారని, అలాంటి పాఠశాలను మూసివేయొద్దని విద్యార్థులు ఎమ్మెల్యేని కోరారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకుంటే తమ చదువులు మూలనపడతాయని తెలిపారు.
జగన్నాథపురం పాఠశాలను ఎందుకు మూసివేస్తున్నారంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తమ స్కూలును మాత్రం కొనసాగించాల్సిందేనని వారు స్పష్టం చేశారు.