ఈ సమయంలో ఆ ఊసు ఎత్తకూడదు: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం
  • చర్చలకు ఇది మంచి టైం కాదన్న ఇమ్రాన్ ఖాన్
  • కశ్మీర్ లో హక్కుల గురించే ఆందోళన అని వ్యాఖ్య
  • సమస్యను హుందాగా పరిష్కరించుకోవాలన్న ఇమ్రాన్ 
భారత్, పాక్ మధ్య ఉన్న ఏకైక సమస్య కశ్మీర్ మాత్రమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ తో పాక్ సంబంధాలు బలపడాలని, అయితే, అందుకు టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై తమ జట్టు గెలిచిన ఈ తరుణం సరైంది కాదని అన్నారు. ఇలాంటి టైంలో అసలు ఆ ఊసు కూడా ఎత్తకూడదన్నారు. ఆ సమస్యను హుందాగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నిర్వహించిన పాకిస్థాన్–సౌదీ ఇన్వెస్ట్ మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడారు. చైనాతో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్ తో కూడా సంబంధాలు బలపడితే భారత్, పాక్ రెండూ శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతాయని చెప్పారు. కశ్మీర్ ప్రజలకు 72 ఏళ్ల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కల్పించిన హక్కుల అమలు గురించే తమ ఆందోళనంతా అని అన్నారు. వారికి ఆ హక్కులిస్తే తమకు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు.


More Telugu News