డబ్బుల కోసం కల్లు వ్యాపారిని బెదిరించిన కేసు.. తీన్మార్ మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్
- వ్యాపారిని బెదిరించిన కేసులో ఎ2 నిందితుడిగా మల్లన్న
- ఎ1 నిందితుడిగా మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్
- మల్లన్నను నిన్న కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
నిజామాబాద్‌కు చెందిన కల్లు వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు నిజామాబాద్ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఇదే కేసులో మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్ ఎ1 నిందితుడు కాగా, మల్లన్న ఎ2 నిందితుడుగా ఉన్నారు.
ఈ నెల 10న కేసు నమోదు కాగా, అదే రోజున సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆ సమయంలో మల్లన్న మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో చంచల్‌గూడ నుంచి మల్లన్నను తీసుకొచ్చిన పోలీసులు నిన్న నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.