తెలంగాణలో కొత్తగా 179 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 179 కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 66 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,023 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 104 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,453 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,481 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,023 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,949కి పెరిగింది.


More Telugu News