మీరు అధికారంలోకి వచ్చి 29 నెలలైంది... ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?: దేవినేని ఉమ
- నీటి ప్రాజెక్టులపై మంత్రి అనిల్ విమర్శలు
- కౌంటర్ ఇచ్చిన ఉమామహేశ్వరరావు
- తాము 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని వెల్లడి
- దేనికెంత ఖర్చుచేశామో చెప్పగలమని స్పష్టీకరణ
నీటి ప్రాజెక్టుల అంశంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అదే స్థాయిలో బదులిచ్చారు. అధికారంలోకి వచ్చి 29 నెలలైనా ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మీడియా ముందుకు వచ్చి రివర్స్ టెండరింగ్ అంటూ డ్రామాలు ఆడే మంత్రి ఇవాళ ఆ ఊసే ఎత్తలేదని ఎద్దేవా చేశారు.
సాగునీటి ప్రాజెక్టులపై తాము రూ.65 వేల కోట్లు ఖర్చు చేశామని, దేనికి ఎంత ఖర్చు చేశామో ప్రతి వివరం చెప్పగలమని ఉమ స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 2019 నాటికి 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని, 13 ప్రాజెక్టులు పైపులైనుల దశలో ఉన్నాయని వివరించారు. గతంలో తమ ప్రభుత్వం సమగ్ర జలవిధానంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే... ఈ మంత్రి, ఈ సీఎం సాగునీటి రంగాన్ని కుదేలు చేశారని విమర్శించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఇచ్చారు? ఎక్కడ ఎంతమేర పనులు జరిగాయో చెప్పే దమ్ముందా? అంటూ ఉమ సవాల్ విసిరారు.