దంచికొట్టిన ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్... స్కాట్లాండ్ లక్ష్యం 191 రన్స్

  • టీ20 వరల్డ్ కప్ లో నేడు స్కాట్లాండ్ వర్సెస్ ఆఫ్ఘన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 రన్స్
  • రాణించిన టాపార్డర్
స్కాట్లాండ్ తో సూపర్-12 పోరులో ఆఫ్ఘనిస్థాన్ టాపార్డర్ బ్యాట్లు ఝుళిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఓపెనర్ హజ్రతుల్లా జాజాయ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మహ్మద్ షాజాద్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు.

తొలి వికెట్ కు 54 పరుగులు జోడించి ఓపెనర్లు పునాది వేయగా, నజీబుల్లా, గుర్బాజ్ స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నజీబుల్లా 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు సాధించాడు. గుర్బాజ్ 37 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులు నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 2, డేవీ 1, మార్క్ వాట్ 1 వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది.


More Telugu News