ఐపీఎల్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు... బీసీసీఐ ప్రకటన
- కొత్త జట్లకు ఇటీవల బిడ్లు ఆహ్వానించిన బీసీసీఐ
- అహ్మదాబాద్ జట్టును సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్స్
- లక్నో జట్టును చేజిక్కించుకున్న ఆర్పీజీ గ్రూప్
- వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త జట్లు రంగప్రవేశం చేశాయి. వచ్చే సీజన్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పాల్గొంటాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు కొత్త జట్ల కోసం ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్ లో... అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకుంది. లక్నో జట్టును ఆర్పీజీ గ్రూప్ చేజిక్కించుకుంది.
లక్నో ఫ్రాంచైజీ కోసం ఆర్పీజీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.7 వేల కోట్లకు బిడ్ వేశారు. అటు, అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ సంస్థ రూ.5 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల చేరికతో ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి పెరిగింది. వచ్చే సీజన్ నుంచే ఈ రెండు జట్లు తమ ప్రస్థానం ఆరంభించనున్నాయి.