భారత జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ఆటగాడినే దూషిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
- వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి
- షమీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- ఖండించిన ఒవైసీ
- ముస్లింలపై విద్వేషం వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం
టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. షమీ విసిరిన ఓవర్లోనే పాక్ గెలుపు పరుగులు సాధించి సంబరాలు చేసుకుంది. దాంతో షమీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో షమీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బాసటగా నిలిచారు.
నిన్నటి మ్యాచ్ నేపథ్యంలో షమీని దూషిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై విద్వేషం, వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. క్రికెట్ లో గెలుపోటములు సహజమని, జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ఆటగాడినే లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారని తెలిపారు. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుందా? అని ఒవైసీ ప్రశ్నించారు.