సినిమాలు మనదేశపు సాంస్కృతిక ఎగుమతులు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు
  • భారతీయ చిత్రాలు కీలక సందేశాన్ని మోస్తుంటాయని వెల్లడి
  • సందేశాత్మక చిత్రాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని వివరణ
ఢిల్లీలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలు మనదేశపు సాంస్కృతిక ఎగుమతుల్లో అగ్రగాములు అని అభివర్ణించారు.  ప్రపంచ భారతీయ సమాజాన్ని తిరిగి స్వదేశానికి అనుసంధానించడంలో కీలకపాత్ర సినిమాలదేనని పేర్కొన్నారు.

"భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు కీలక సందేశాన్ని అందిస్తుంటాయి. అందుకే మన సినిమాలు భారతీయతను లేక హిందూస్థానిజంను ప్రతిబింబించేలా ఉండాలి. సాంస్కృతిక దౌత్యంలో ముందువరుసలో నిలిచే రాయబారుల వంటి పాత్రను మన సినిమాలు పోషించాలి. సందేశంతో కూడిన చిత్రాలకు శాశ్వత ఆదరణ ఉంటుందని మనందరకి తెలుసు" అని పేర్కొన్నారు.


More Telugu News