'రొమాంటిక్' చూసి కన్నీళ్లు పెట్టుకున్న పూరి!

  • 'రొమాంటిక్' ఫస్టు కాపీ పూరి చూశారన్న దర్శకుడు అనిల్ 
  • ఆయన చాలా ఎమోషనల్  అయ్యారు 
  • ఆయనను అంతకుముందు అలా చూడలేదన్న అనిల్ 
ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో 'రొమాంటిక్ సినిమా రూపొందింది. పూరి - చార్మీ కలిసి ఈ సినిమాను నిర్మించారు. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ పాళ్లతో సాగే కథ ఇది. ఈ సినిమాకు కథ .. మాటలు .. స్క్రీన్ ప్లే అందించింది పూరి కావడం విశేషం. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ పాదూరి మాట్లాడుతూ, " నేను ఈ సినిమా ఫస్టుకాపీని పూరి గారికి చూపించాను. ఈ సినిమాలోని ఒక ఎమోషన్ సీన్ చూసిన ఆయన, వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన అంతలా ఎమోషనల్ కావడం నేను ఎప్పుడూ చూడలేదు.

'నేను రాసిన ఈ సీన్లో ఇంత ఎమోషన్ ఉందా? 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమా కోసం నేను మంచి ఎమోషన్ సీన్ రాశాను. ఆ తరువాత అంత గొప్పగా రాసిన సీన్ ఇదేనని అనిపిస్తోంది. ఆ సినిమాలో కంటే ఈ సినిమాలో ఎమోషన్ సీన్ ఇంకా బాగా వచ్చింది' అన్నారు పూరిగారు. ఈ సినిమాతో ఆకాశ్ కి హిట్ పడటం ఖాయం" అన్నారు అనిల్ పాదూరి.


More Telugu News