పాక్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఔట్‌పై దుమారం

  • నో బాల్‌కు అవుటయ్యాడంటున్న నెటిజన్లు
  • ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ మండిపడుతున్న వైనం
  • షహీన్ గీత దాటి బంతి వేసినట్టు స్పష్టంగా చూపిస్తున్న ఫొటోలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓటమి పాలై టోర్నీని పరాజయంతో ప్రారంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాక్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.

అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్ కాదంటూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో షహీన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. అయితే, అది నో బాల్ అని చెబుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. గీత దాటి బౌలింగ్ వేసినట్టు ఆ ఫొటోలు, వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి రాహుల్ నాటౌట్ అని, షహీన్ వేసిన నోబాల్‌కు అతడు అయినట్టు స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.


More Telugu News