పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై ఎంపీ మనీశ్ తివారి తీవ్ర ఆవేదన

  • పార్టీలో ఇలాంటి అస్పష్ట, అరాచక వైఖరిని గతంలో ఎప్పుడూ చూడలేదు
  • ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు
  • చిన్నపిల్లల్లా గొడవ పడుతూ దారుణంగా తిట్టుకుంటున్నారు
పంజాబ్ కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆ  పార్టీ ఎంపీ మనీశ్ తివారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇలాంటి అస్పష్ట, అరాచక వైఖరిని గతంలో ఎప్పుడూ చూడలేదంటూ వరుస ట్వీట్లు చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టేసి ఎమ్మెల్యేలు, ప్రముఖులు చిన్నపిల్లల్లా గొడవ పడుతూ, అసహ్యంగా తిట్టుకుంటున్నారని అన్నారు. ఏదో సీరియల్‌లా సాగుతున్న ఈ అంశాలను ప్రజలు అసహ్యించుకోవడం లేదని పార్టీ భావిస్తున్నట్టు ఉందన్నారు.

అంతేకాదు, రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ ముప్పు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రం వంటి ఘటనలపై విచారణ ఎంత వరకు వచ్చిందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వాన్ని తివారి ప్రశ్నించారు. పంజాబ్‌లో పరిస్థితులను చక్కదిద్ది పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటైన మల్లికార్జున ఖర్గే కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టమైదని విమర్శించారు.


More Telugu News