చీకటి పడిన తర్వాత మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లొదన్న బీజేపీ నాయకురాలు బీబీమౌర్య.. విమర్శలతో విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు

  • మహిళా పోలీసులు ఉన్నప్పటికీ వెళ్లకపోవడం మంచిది
  • ఐదు దాటిన తర్వాత వెళ్లాల్సి వస్తే ఆలోచించాలని హితవు
  • ఆదిత్యనాథ్ హయాంలో అంతేనన్న ప్రతిపక్షాలు
చీకటి పడిన తర్వాత మహిళలు ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లొందంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీరాణి మౌర్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వారణాసిలోని బజర్‌డీహా ప్రాంతంలోని వాల్మీకి బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌లో మహిళా అధికారులు కూడా ఉన్నారని, అయినప్పటికీ సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

బేబీరాణి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలను బట్టి యూపీలో పోలీస్ స్టేషన్లు మహిళలకు ప్రమాదకరమన్న విషయం అర్థమవుతుందని విమర్శలు గుప్పించాయి. బేబీరాణి మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీఎస్పీ ఎంపీ కుంవర్ డానిష్ అలీ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో పోలీస్ స్టేషన్లు డేంజరేనన్న విషయం మరోమారు స్పష్టమైందని అన్నారు.


More Telugu News