సూపర్-12లో ఆసీస్ శుభారంభం... దక్షిణాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో విక్టరీ
- గ్రూప్-1లో ఆసీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- ఆస్ట్రేలియా టార్గెట్ 119 రన్స్
- 19.4 ఓవర్లలో ఛేదించిన కంగారూలు
- రాణించిన స్మిత్, స్టొయినిస్
అన్ని రంగాల్లోనూ పటిష్ఠంగా ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది. అబుదాబిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కంగారూలు 5 వికెట్ల తేడాతో నెగ్గారు. సఫారీలు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించారు. రెండు పరుగులు చేస్తే గెలుస్తారన్న దశలో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది.
లక్ష్యఛేదనలో ఆసీస్ 20 పరుగులకే ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (0), డేవిడ్ వార్నర్ (14)ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (11) కూడా వెనుదిరగ్గా... మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరుబోర్డును నడిపించాడు. మ్యాక్స్ వెల్ 18 పరుగులు చేయగా, చివర్లో మాథ్యూ వేడ్ (15 నాటౌట్), స్టొయినిస్ (24 నాటౌట్) జోడీ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించింది. సఫారీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2, రబాడా 1, కేశవ్ మహరాజ్ 1, తబ్రైజ్ షంసీ 1 వికెట్ తీశారు.
అంతకుముందు, టాస్ ఓడిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు నమోదు చేసింది.
అటు, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు దుబాయ్ లో తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.