వెంకీ చేతుల మీదుగా 'పెద్దన్న' టీజర్ రిలీజ్!

  • యాక్షన్ ప్రధానంగా సాగిన టీజర్
  • రజనీ పాత్ర పైనే పూర్తి ఫోకస్  
  • ఆయన మార్క్ యాక్షన్ 
  • నవంబర్ 4వ తేదీన విడుదల
రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాటు భారీ తాగారణం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ కానుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు.

తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ కి కూడా మాస్ నుంచి మంచి మార్కులు దక్కాయి. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను హీరో వెంకటేశ్ తో రిలీజ్ చేయించారు. 'పెద్దన్న'గా రజనీ లుక్ బాగుందంటూ ఆయనకి వెంకటేశ్ బెస్ట్ విషెస్ తెలియజేశారు.

రజనీకాంత్ స్టైల్ .. ఆయన మార్క్ యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాలనే దర్శక నిర్మాతల ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. గతంలో రజనీతో భారీ హిట్లు అందుకున్న ఖుష్బూ .. మీనా .. నయనతార ఈ సినిమాలో ఆయన సరసన కనిపిస్తుండటం విశేషం.


More Telugu News