టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియా టార్గెట్ 119 రన్స్

  • నేటి నుంచి సూపర్-12 పోటీలు
  • అబుదాబిలో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచిన ఆసీస్
  • మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు
  • రాణించిన ఆస్ట్రేలియా  బౌలర్లు
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో సఫారీలు స్వల్పస్కోరుకే పరిమితం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 118 పరుగులు చేసింది.

మిడిలార్డర్ లో దిగిన ఐడెన్ మార్ క్రమ్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో రబాడా 19 పరుగులు చేయగా, కెప్టెన్ బవుమా 12, మిల్లర్ 16, క్లాసెన్ 13 పరుగులు చేశారు. స్టార్ ఆటగాడు డికాక్ (7), వాన్ డర్ డుస్సెన్ (2) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, జోష్ హేజెల్ వుడ్ 2, ఆడమ్ జంపా 2, మ్యాక్స్ వెల్ 1, పాట్ కమిన్స్ 1 వికెట్ తీశారు.


More Telugu News