సిటీ బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం స్టాలిన్
- సీఎంగా తనదైన ముద్రవేస్తున్న ఎంకే స్టాలిన్
- ప్రజలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు
- ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆసక్తి
- కాన్వాయ్ ఆపి ఆర్టీసీ బస్సెక్కిన వైనం
తొలిసారి తమిళనాడు సీఎం పీఠం ఎక్కిన ఎంకే స్టాలిన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలతో మమేకం అయ్యేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా ఆయన చెన్నైలో ఓ సిటీ బస్సులో ప్రయాణించారు. బస్సులో సీఎంను చూసి ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
నగరంలోని కన్నాగి ప్రాంతంలో ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సీఎం స్టాలిన్ తిరిగి వెళ్లే క్రమంలో తన కాన్వాయ్ ను ఆపేసి, సిటీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. మహిళలకు ఉచిత టికెట్లపై ఆరా తీశారు. వాటివల్ల ప్రయోజనం చేకూరుతోందా? అని అడిగారు. అంతేకాదు, ప్రయాణాల్లో విధిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. పలువురు ప్రయాణికులకు మాస్కులు లేకపోవడాన్ని గుర్తించిన సీఎం స్టాలిన్, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు.
ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలకు ఉత్సాహం ప్రదర్శించగా... ఆయన వారికి సహకరించారు. స్టాలిన్ బస్సు ప్రయాణం తాలూకు వీడియోను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.