కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే కోహ్లీ నిర్ణయానికి బీసీసీఐ ఒత్తిడి కారణం కాదు: గంగూలీ

  • టీ20 కెప్టెన్ గా తప్పుకోవాలనే కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యపరిచింది
  • అది కోహ్లీ తీసుకున్న సొంత నిర్ణయం
  • మూడు ఫార్మాట్లకు సుదీర్ఘకాలం నాయకత్వం వహించడం అంత సులభం కాదు
టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది కోహ్లీ సొంత నిర్ణయమని... బీసీసీఐ ఒత్తిడి కారణంగా ఆయన కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం లేదని చెప్పారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయం వెనుకున్న కారణాలను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

అయినా, మూడు ఫార్మాట్లకు భారత జట్టుకు సుదీర్ఘకాలం నాయకత్వం వహించడం అంత సులభం కాదని చెప్పారు. గతంలో తనతో సహా ఇతర కెప్టెన్లందరూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవారేనని తెలిపారు. టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్లో తాను బ్యాట్స్ మెన్ గానే కొనసాగుతానని చెప్పాడు.


More Telugu News