పెద్దిరెడ్డితో పాటు ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై ఎన్నిక‌ల సంఘానికి సోము వీర్రాజు ఫిర్యాదు

  • ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించారు
  • వైసీపీకే ఓటు వేయాలంటూ ఉద్యోగుల‌పై ఒత్తిడి
  • పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. సీఈవో, ఆర్వోకు ఈ రోజు ఉద‌యం విన‌తిప‌త్రం అందించారు. వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని ఆయ‌న తెలిపారు. వైసీపీకే ఓటు వేయాలంటూ ఉద్యోగుల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని ఎన్నిక‌ల సంఘానికి ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేత‌లు చ‌ట్ట విరుద్ధ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ప్ప‌టికీ వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేదని ఆయ‌న ఆరోపించారు. మ‌రోవైపు, బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌చారంలో  సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు స‌మ‌క్షంలో వైసీపీ నుంచి వచ్చిన 150 మంది బీజేపీలో చేరారు. బ‌ద్వేలులో భూ క‌బ్జాలు పెరిగిపోయాయని, వైసీపీ నేత‌లు సామాన్యుల స్థ‌లాల‌నూ క‌బ్జా చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.


More Telugu News