'ప్రాజెక్టు K'లో సూపర్ హీరోగా ప్రభాస్!

  • చేతిలో వరుస పాన్ ఇండియా సినిమాలు 
  • వివిధ జోనర్లకు సంబంధించిన కథలు 
  • సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే 'ప్రాజక్టు K'
  • కీలకమైన పాత్రలో అమితాబ్  
ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తాజా సినిమాలకి సంబంధించిన అప్ డేట్ లతో సోషల్ మీడియా అంతా సందడిగా ఉంది. ఎక్కడ చూసినా ప్రభాస్ కి సంబంధించిన పోస్టర్లు .. విషెస్ కనిపిస్తున్నాయి. ఇన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు చేతిలో పట్టుకుని ఆయన జరుపుకుంటున్న పుట్టినరోజు ఇది.

 ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో కూడినవే .. అలాగే ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్ల నుంచి వస్తున్నవే. 'బాహుబాలి'ని ఒక జానపద చిత్రంగా చెప్పుకోవచ్చు. పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్' చేస్తున్న ఆయన, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో 'ప్రాజెక్టు K' చేయనున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. ఈ రోజున వైజయంతీ మూవీస్ వారు ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ, సూపర్ హీరో అంటూ సంబోధించారు. దాంతో ఇది సూపర్ హీరో ఫిల్మ్ అనే విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్టు అయింది. ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొనే .. కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.


More Telugu News