'భోళాశంకర్' వెనక్కి .. 'వాల్తేర్ వీరయ్య' ముందుకు?
- 'గాడ్ ఫాదర్' షూటింగులో చిరు
- మెహర్ రమేశ్ తో 'భోళా శంకర్'
- బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య'
- మనసు మార్చుకున్న చిరంజీవి
ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నారు. ఇది మలయాళ మూవీ 'లూసిఫర్'కి రీమేక్. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' సినిమా చేయవలసి ఉంది.
ఆ మధ్య తమిళంలో అజిత్ కి తిరుగులేని హిట్ ఇచ్చిన సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాల వరుస విషయంలో మెగాస్టార్ మనసు మారిందనే టాక్ వినిపిస్తోంది.
ముందుగా 'వాల్తేర్ వీరయ్య' సినిమాను పూర్తి చేసి, ఆ తరువాతనే 'భోళాశంకర్' తో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట. వెంటవెంటనే రెండు రీమేకులు చేయకుండా, మధ్యలో ఒక స్ట్రయిట్ సినిమా చేయడమే మంచిదనే అభిప్రాయంలో చిరంజీవి ఉన్నారని అంటున్నారు.