తిరుపతిలో భారీ వాన.. రోడ్డుపై వరద నీటిలో కారు మునిగి నవ వధువు మృతి
- శ్రీవారి దర్శనానికి వచ్చిన నూతన వధూవరులు
- రైల్వే అండర్ పాస్ కింద చిక్కుకున్న వారి కారు
- పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
వారికి నెల క్రితమే వివాహమైంది. ఆ నవజంట తిరుమల శ్రీవారి మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వచ్చారు. కానీ, వానలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. నవ వధువును బలి తీసుకున్నాయి. కర్ణాటక రాయచూర్ కు చెందిన ఆ ఫ్యామిలీ.. నిన్న తిరుపతికి వచ్చింది. నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో వెస్ట్ చర్చి సమీపంలోని రైల్వే అండర్ పాస్ లో భారీగా వరద నిలిచింది.
దీంతో వారు ప్రయాణిస్తున్న తూఫాన్ వాహనం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అందులో ఉన్న ఏడుగురు బయటకు రాలేకపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఆరుగురిని కాపాడారు. నవ వధువు అప్పటికే చనిపోయింది. మరో చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.