రాష్ట్రంలో పౌరయుద్ధం తప్పదేమోనన్న డౌట్ వస్తోంది.. వచ్చే వారం నా ఇంటిపైనా దాడి జరగొచ్చు: రఘురామరాజు

  • మంత్రులు, ఎమ్మెల్యేలు వాడుతున్న భాష దారుణంగా ఉంది
  • మంగళగిరి కాబట్టి దాడులతో సరిపెట్టారు.. అదే రాయలసీమ అయ్యుంటే ఖూనీలు జరిగేవన్నారు 
  • బలవంతంగానే వైసీపీ జనాగ్రహ దీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పౌరయుద్ధం తప్పదేమోనన్న అనుమానం వస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరిలో కాబట్టి దాడులతో సరిపెట్టారని, అదే రాయలసీమలోనైతే పరిస్థితి ఖూనీల వరకు వెళ్లేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారని తెలిపారు. ఢిల్లీలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

భీమవరంలోని తన ఇల్లు, కార్యాలయాలపై వచ్చే వారం దాడి చేయాలని కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తనకు సమాచారం అందిందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని, డీజీపీకి లేఖ రాశానని అన్నారు. వైసీపీ జనాగ్రహ దీక్షలు బలవంతంగా చేపట్టినవేనని విమర్శించారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉపయోగిస్తున్న భాష దారుణంగా ఉందన్నారు. దీక్షలతో పెద్దగా వచ్చే ఇబ్బందేమీ లేదని, కానీ భాష విషయంలోనే జాగ్రత్తగా ఉండాలని రఘురామకృష్ణరాజు సూచించారు.


More Telugu News