భారత్-ఇంగ్లండ్ మధ్య ఆగిపోయిన ఐదో టెస్టు జులైలో.. రీషెడ్యూల్ చేసిన ఈసీబీ

  • కరోనా కారణంగా ఆగిపోయిన చివరి టెస్టు
  • జులై 1న ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి టెస్టు
  • అనంతరం టీ20, వన్డే సిరీస్
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వచ్చే ఏడాది జులైలో ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే, టీ 20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది.

గత నెల 10-14 మధ్య మాంచెస్టర్‌లో జరగాల్సిన ఈ టెస్టు కరోనా కారణంగా వాయిదా పడింది. భారత జట్టు బృందంలోని సహాయక సభ్యులకు కరోనా సోకడంతో భారత జట్టు మైదానంలోకి దిగేందుకు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో ఈ టెస్టు రీషెడ్యూలుకు బీసీసీఐ అప్పట్లోనే ప్రయత్నించినప్పటికీ సందిగ్ధత మాత్రం వీడలేదు. తాజాగా ఈ టెస్టును జులై ఒకటో తేదీకి రీ షెడ్యూల్ చేసినట్టు ఈసీబీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది.

జులై 1-5 మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ టెస్టు జరుగుతుందని, అనంతరం  7న ఏజీస్ బౌల్‌లో తొలి టీ20, 9న ఎడ్జ్‌బాస్ట్‌లో రెండో టీ20, ట్రెంట్ బ్రిడ్జ్‌లో 10న మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జులై 12న కియా ఓవల్‌లో తొలి వన్డే, లార్డ్స్‌లో 4న రెండో వన్డే, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మూడో వన్డే జరుగుతాయి.


More Telugu News