ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు: ఈటలపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
- హుజూరాబాద్ ఉపఎన్నికకు దగ్గర పడుతున్న సమయం
- ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన రాజకీయ పార్టీలు
- ఈటలపై ఇప్పటికే పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా వారు మరోసారి ఈసీ తలుపు తట్టారు. హుజూరాబాద్ లో ఓటర్లకు డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు.
కొత్త బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని... ఇప్పటికైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఈసీని కలిసిన వారిలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఉన్నారు.