చైనా దాడి చేస్తే తైవాన్‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాం: జో బైడెన్

  • తైవాన్‌ను త‌మ దేశంలో క‌లిపేసుకోవాల‌ని చైనా మ‌రోసారి ప్ర‌య‌త్నాలు
  • మౌనం వీడిన జో బైడెన్
  • తైవాన్‌ను కాపాడే  విష‌యంపై క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న  
తైవాన్‌ను త‌మ దేశంలో క‌లిపేసుకోవాల‌ని చైనా మ‌రోసారి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన విష‌యం తెలిసిందే. చైనా విస్త‌ర‌ణవాదంపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఎట్ట‌కేల‌కు స్పందించారు. చైనా తీరును ఎండ‌గ‌ట్టారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే తాము అడ్డుకుంటామ‌ని చెప్పారు. తైవాన్‌కు అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని తెలిపారు. తైవాన్‌ను కాపాడుతారా? అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఆ విధంగా సమాధానం చెప్పారు. తైవాన్‌ను కాపాడే  విష‌యంపై తాము క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు చెప్పారు.

అలాగే, తైవాన్ విష‌యంలో అమెరికా ప్ర‌భుత్వ విధానంలో ఎటువంటి మార్పులేద‌ని శ్వేత‌సౌధ‌ ప్ర‌తినిధి ఒక‌రు స్ప‌ష్టం చేశారు. అమెరికా చేసిన ప్ర‌క‌ట‌నపై తైవాన్ కూడా స్పందించింది. చైనా విష‌యంలో త‌మ విధానం కూడా ఏమీ మార‌ద‌ని స్ప‌ష్టం చేసింది. చైనా దాడి చేస్తే తామే ప్ర‌తిదాడి చేస్తామ‌ని తెలిపింది. తైవాన్‌కు చాలా కాలం నుంచి అమెరికా ఆయుధాలు విక్ర‌యిస్తోంది.


More Telugu News