ఆసక్తికరంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్!

  • వ్యాక్సినేషన్ లో 100 కోట్ల మైలురాయి
  • దానిని ప్రతిబింబించేలా ప్రొఫైల్ పిక్
  • టీకా సీసా, 100 కోట్ల సంఖ్య, వారియర్స్ తో ఫొటో
ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను మార్చారు. ఆసక్తికరమైన ఫొటోను పిక్ గా పెట్టుకున్నారు. దేశంలో కరోనా టీకా డోసులు 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో ఆయన.. ఆ విజయం ప్రతిబింబించేలా ప్రొఫైల్ పిక్ ను పెట్టారు. కరోనా టీకా సీసా, 100 కోట్ల సంఖ్య, కరోనా వారియర్లతో కూడిన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్ గా వాడారు.


కరోనా పోరులో భాగంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్లను వేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో చాలా దేశాలకు టీకాలను పంపించి ఆపన్న హస్తం అందించినా.. ప్రతిపక్షాల విమర్శలతో విదేశాలకు ఇచ్చే టీకాలను తగ్గించి ఇక్కడ వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచారు.

అక్టోబర్ 21 నాటికి కేవలం తొమ్మిది నెలల్లోనే వందకోట్ల డోసుల ఘనతను అందుకున్నారు. మొత్తంగా ఇప్పటిదాకా దేశ జనాభాలో 71,14,28,668 మంది తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 29.61 కోట్ల మందికి రెండు డోసులు పడ్డాయి. మొత్తంగా 77,13,74,899 మందికి టీకాలు వేశారు. దేశ జనాభాలో 55 శాతం మంది టీకాలు వేయించుకున్నారు.


More Telugu News