దీక్ష చేస్తోన్న చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్
- సంఘీభావం తెలిపిన నారాయణ
- చంద్రబాబుని నేరుగా కలవలేకపోతున్నానని వ్యాఖ్య
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శ
- ప్రజల కోసం కలిసి పని చేద్దామని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న దీక్ష కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబుకు సీపీఐ సీనియర్ నేత నారాయణ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు.
తాను వేరే పనుల్లో బిజీగా ఉండడంతో చంద్రబాబుని నేరుగా కలవలేకపోతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ప్రజల కోసం కలిసి పని చేద్దామని చెప్పారు. కాగా, టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆ ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.