దేశ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాం: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
- కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సత్తా
- దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం
- కఠినమైన లక్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగలదు
- ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోవడం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమని తెలిపారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా దేశ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించామని చెప్పారు.
కఠినమైన లక్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగలదని చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఆయన చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా టీకాలు అందించామని తెలిపారు. భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొనసాగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని తెలిపారు.
బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో, అంతే సాధారణంగా మాస్క్ కూడా ధరించాలని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణులతో పాటు విదేశీ నిపుణులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. దేశ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోన్న నేపథ్యంలో కరోనాను తట్టుకునే శక్తి ప్రజలకు వస్తోందని తెలిపారు. దేశంలో పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందాయని చెప్పారు. రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్లు వేయడమంటే ఇది సాధారణ విషయం కాదని తెలిపారు. దేశంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టామని చెప్పారు.