అంతరిక్ష రంగంలో సొంతంగా ఎదగాలన్న దక్షిణ కొరియా ఆశలు ఆవిరి.. రాకెట్ ప్రయోగం విఫలం

  • స్వీయ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్
  • ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలం
  • అయినా ముందడుగేనన్న అధ్యక్షుడు మూన్
అంతరిక్ష రంగంలో ఎవరి సాయమూ లేకుండా ఎదగాలన్న దక్షిణ కొరియాకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతికంగా ముందుండే దక్షిణ కొరియా స్వీయ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి రాకెట్‌లో డమ్మీ ఉపగ్రహాన్ని ఉంచి నిన్న ప్రయోగించారు. రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నప్పటికీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో అది విఫలమైంది.

 47 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌కు ‘నురి’ అని పేరు పెట్టారు. మూడు దశలు కలిగిన నురిలో 1.5 టన్నుల బరువైన స్టీలు, అల్యూమినియం దిమ్మెను డమ్మీ పేలోడ్‌లా అమర్చారు. నిర్ణీత సమయానికి గంట ఆలస్యంగా ప్రయోగం ప్రారంభమైంది. నారో అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు మూన్ జే-ఇన్ తిలకించారు. రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నప్పటికీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలమైంది. అయితే, ప్రయోగం విఫలమైనా ఇది ముందడుగేనని అధ్యక్షుడు మూన్ పేర్కొన్నారు.


More Telugu News