ట్రైనీ ఐఏఎస్ బానోతు మృగేందర్‌లాల్‌పై కూకట్‌పల్లిలో లైంగిక వేధింపుల కేసు నమోదు
- ఫేస్‌బుక్‌లో యువతితో పరిచయం
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం
- బాధితురాలు తమ బంధువేనన్న వైరా మాజీ ఎమ్మెల్యే
- ఆయన కుమారుడే మృగేందర్‌లాల్
ఓ యువతి ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐఏఎస్ బానోతు మృగేందర్‌లాల్ (30)పై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో శిక్షణలో ఉన్నారు. మృగేందర్‌లాల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సమయంలో కూకట్‌పల్లికి చెందిన యువతి (25)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో ఓ రోజు యువతి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బయటకు తీసుకెళ్లి ఆయన స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. టీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే అయిన మృగేందర్ తండ్రి మదన్‌లాల్, తల్లి కలిసి తనను బెదిరించారని పేర్కొంది.
ఈ విషయమై మదన్‌లాల్ మాట్లాడుతూ.. బాధితురాలు తమ బంధువేనన్నారు. కేసు గురించి మాత్రం తనకు తెలియదన్నారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.