వాతావరణ నివేదిక బదులు టీవీ చానల్లో అశ్లీల క్లిప్పింగ్ ప్రసారం!

  • కేఆర్ఈఎం చానల్లో పోర్న్ క్లిప్పింగ్
  • ఉలిక్కిపడిన వీక్షకులు
  • పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • క్షమాపణలు తెలిపిన చానల్ ప్రతినిధులు
అమెరికాలో ఓ టీవీ చానల్ లో అశ్లీల క్లిప్పింగ్ ప్రసారం కావడం కలకలం రేపింది. కేఆర్ఈఎం అనే లోకల్ చానల్ ప్రఖ్యాత సీబీఎస్ సంస్థకు అనుబంధంగా వాషింగ్టన్ లో ప్రసారాలు నిర్వహిస్తుంటుంది. అయితే, ఆదివారం సాయంత్రం కేఆర్ఈఎం చానల్లో వాతావరణానికి సంబంధించిన వార్తలు చూస్తున్న వీక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చానల్లో వాతావరణ నివేదిక బదులు ఓ పోర్న్ క్లిప్పింగ్ దర్శనమిచ్చింది. ఆ సమయంలో మిచెల్లీ బాస్ అనే యాంకర్ వాతావరణ వార్తలు చదువుతోంది. అశ్లీల క్లిప్పింగ్ ప్రసారమవుతున్న విషయాన్ని ఆమె గానీ, ఆమె సహ యాంకర్ కోడీ ప్రాక్టర్ గానీ గుర్తించలేకపోయారు.

దీనిపై కేఆర్ఎంఈ ప్రతినిధులు స్పందించి, వీక్షకులకు క్షమాపణలు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై పలువురు వీక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వార్తా చానల్లో పోర్న్ క్లిప్ ప్రసారం కావడంపై తమకు లెక్కకుమిక్కిలిగా ఫోన్ కాల్స్ వచ్చాయని పోలీసు విభాగం వెల్లడించింది.

2017లో ఇలాంటి ఘటనే బీబీసీ చానల్లోనూ జరిగింది. ఓవైపు లైవ్ షో వస్తుండగా, చానల్ ఉద్యోగి ఒకరు అశ్లీల వీడియోలు చూస్తున్న విషయం ఆ లైవ్ షోలో కనిపించింది.


More Telugu News