మా ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారు: అచ్చెన్నాయుడు
- టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి
- పట్టాభి ఇంటి వద్ద విధ్వంసం
- గవర్నర్ కు వివరించిన టీడీపీ నేతలు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న అచ్చెన్న
- ఆర్టికల్ 356 విధించాలని డిమాండ్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసిన అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి గురించి గవర్నర్ కు తెలిపామని వెల్లడించారు. గవర్నర్ ముందు పలు డిమాండ్లు ఉంచామని వివరించారు. తమ ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. దాడుల అంశాన్ని రాష్ట్రపతి, కేంద్రం దృష్టికి కూడా తీసుకెళతామని అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించాలని డిమాండ్ చేశారు. తమపైనే దాడిచేసి, తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. లోకేశ్ పైనా, ఇతర నేతలపైనా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ డీజీపీ ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.