సీఎం జగన్ పై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
- వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
- సైకో రెడ్డిని నిందితుడిగా చేర్చాలన్న లోకేశ్
- ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. తన సైకో ఫ్యాన్స్ కు బీపీ వచ్చి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని సైకో రెడ్డి కూడా అంగీకరించాడని, టీడీపీ కార్యాలయంపై దాడిలో సైకో రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. నీకే కాదు... మాకూ ఉన్నారు లక్షల మంది ఫ్యాన్స్. వాళ్లకి బీపీ వస్తే నువ్వు ఏపీలో ఉండలేవు అంటూ లోకేశ్ హెచ్చరించారు.
ఇక, ఆంధ్రాలో వైసీపీ వాళ్లు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసి వదిలిపెట్టారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.