రోడ్డుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అడ్డుకున్న పోలీసులు.. మండిపడ్డ టీడీపీ నేత.. వీడియో ఇదిగో
- పోలీసు వారు చట్టానికి లోబడి పని చెయ్యాలి
- అంతేగానీ అధికార పార్టీకి లోబడి కాదు
- ఒక ప్రజా ప్రతినిధిని అకారణంగా ఎలా ఆపుతారు?
- వైసీపీ నాయకులు ఏమో ధర్నాలకి రోడ్డు ఎక్కొచ్చు అంటూ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు ధర్నాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తోన్న పోలీసులు తమకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రోడ్డుపై తనను పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు. తనను ఆపినందుకు పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పోలీసు వారు చట్టానికి లోబడి పని చెయ్యాలి. అంతేగానీ అధికార పార్టీకి లోబడి కాదు. ఒక ప్రజా ప్రతినిధిని అకారణంగా ఎలా ఆపుతారు? వైసీపీ నాయకులు ఏమో ధర్నాలకి రోడ్డు ఎక్కొచ్చు. తెలుగుదేశం నాయకులని రోడ్డు మీద ఆపుతారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చచ్చిపోయింది. ఇది సిగ్గు చేటు' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.