'అఖండ' రిలీజ్ మరింత ఆలస్యం?

  • బోయపాటితో బాలయ్య మూడో సినిమా
  • దీపావళికి రిలీజ్ అంటూ టాక్
  • డిసెంబర్ కి వెళుతుందనే ప్రచారం
  • ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్    
బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, దసరాకి విడుదలవుతుందనే అంతా అనుకున్నారు. కానీ షూటింగు పార్టు ఇంకా పూర్తికాని కారణంగా రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4వ తేదీన రానున్నట్టుగా ప్రచారం జరిగింది.

నిజంగానే దీపావళికి పోటీ తక్కువగా ఉంది. అందువలన ఆ రోజున ఈ సినిమా తప్పకుండా థియేటర్లకు వస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఆ రోజున ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. అప్పటికి ఇంకా పనులన్నీ పూర్తయ్యే అవకాశం లేదట. అందువలన డిసెంబర్ కి వెళ్లనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.


More Telugu News