దుబాయ్‌లో మేడం టుసాడ్స్ మ్యూజియం.. కొలువుదీరిన విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం

  • టీమిండియా వన్డే జెర్సీతో బ్యాట్ ఎత్తి నిల్చున్నట్టుగా కోహ్లీ విగ్రహం
  • టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ఏర్పాటు
  • ఢిల్లీ, లండన్, దుబాయ్ మ్యూజియాలు మూడింటిలోనూ కోహ్లీ మైనపు బొమ్మ
దుబాయ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మేడం టుసాడ్స్ మ్యూజియంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టీమిండియా వన్డే జెర్సీ ధరించిన కోహ్లీ బౌలింగును ఎదుర్కొనేందుకు బ్యాట్ ఎత్తి సిద్ధంగా ఉన్నట్టుగా విగ్రహాన్ని రూపొందించారు.

 కోహ్లీతోపాటు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ స్టార్లు రొనాల్డో, మెస్సి, ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తదితరుల విగ్రహాలను కూడా ఈ మ్యూజియంలో ఇది వరకే ఏర్పాటు చేశారు. ఢిల్లీ, లండన్, దుబాయ్ మ్యూజియం మూడింటిలోనూ కోహ్లీ మైనపు బొమ్మలు కొలువుదీరడం గమనార్హం.


More Telugu News