రేపు ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్ష
- టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా 36 గంటల దీక్ష
- ధ్వంసమైన సామగ్రి మధ్యే దీక్ష చేపట్టనున్న బాబు
- అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు
టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షను చేపట్టబోతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యే ఆయన దీక్షకు దిగనున్నారు.
మరోవైపు పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించారు. శనివారం ఢిల్లీకి వెళ్లి కలిసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అపాయింట్ మెంట్ కూడా కోరారు. తాజా పరిస్థితులపై అమిత్ షాకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు.