విలన్ గా జగపతిబాబు బాలీవుడ్ ఎంట్రీ!

  • అడవి నేపథ్యంలో సాగే 'పుకార్'
  • ఫర్హాన్ అక్తర్ జోడీగా రకుల్ 
  • దర్శకుడిగా అశుతోష్ గోవారికర్ 
  • డిసెంబర్ నుంచి షూటింగు మొదలు
చాలామంది హీరోలు తమ కెరియర్ ను విలన్ వేషాలతో మొదలుపెట్టేసి, ఆ తరువాత హీరోలుగా ఒక స్థాయికి చేరుకున్నారు. కానీ జగపతిబాబు విషయంలో అందుకు భిన్నంగా జరుగుతూ వచ్చింది. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పొందిన జగపతిబాబు, ఆ తరువాత విలన్ పాత్రల దిశగా అడుగులు వేశాడు.

తెలుగులోనే కాకుండా ఇతర భాషల నుంచి కూడా జగపతిబాబుకు అవకాశాలు వస్తుండటం .. ఆయన చేస్తుండటం జరుగుతూ వచ్చింది. త్వరలోనే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు  తెలుస్తోంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ హీరోగా 'పుకార్' అనే సినిమా రూపొందనుంది.

ఫారెస్టు నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరో ఫారెస్టు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అటవీ సంపదను కాపాడాలనే ఒక సిన్సియర్ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నాడు. ఆయన జోడీగా రకుల్ అలరించనుంది. ఈ సినిమాలోనే జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట.


More Telugu News