పెద్ద పండక్కి సై అంటున్న 'బంగార్రాజు'!
- టాలీవుడ్ నిర్మాతలకు సంక్రాంతి సెంటిమెంటు
- సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' సహా పలు సినిమాలు
- నాగార్జున హీరోగా రూపొందుతున్న 'బంగార్రాజు'
- పండగ పోటీలో దిగడానికి నిర్మాతల నిర్ణయం
సంక్రాంతి అనగానే 'సినిమాల పండుగ' అన్న నానుడి కూడా మన తెలుగు నాట ఎప్పటి నుంచో వుంది. ఆ మూడు రోజుల పండుగను దృష్టిలో పెట్టుకుని పలు సినిమాలను రిలీజ్ చేస్తుండడం అనాదిగా వుంది. ముఖ్యంగా తమ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కావడాన్ని స్టార్ హీరోలు స్టేటస్ గా.. సెంటిమెంటుగా ఫీలవుతుంటారు. ఆ పండక్కి రిలీజ్ అయ్యే సినిమాల కలెక్షన్లు కూడా గట్టిగానే ఉంటాయి. అందుకే, చాలామంది తమ సినిమాలను సంక్రాంతికి ప్లాన్ చేస్తుకుంటారు.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా కొన్ని భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్'. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ఓ వారం ముందుగానే వస్తోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ, పవన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్', ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్', మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారిపాట' కూడా పండక్కి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.
ఈ క్రమంలో అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతి బరిలో దిగడానికి సై అంటున్నారు. తాజాగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది గతంలో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి విదితమే. ఆ చిత్రం కూడా అప్పట్లో సంక్రాంతికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంటుతోనే ఇప్పుడు దీనిని కూడా పెద్ద పండక్కి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.