డీజీపీ గారూ.. ఏమిటి ఈ వివక్ష?: వర్ల రామయ్య
- టీడీపీ బంద్ కు పిలుపిస్తే అడుగడుగునా ఆంక్షలు
- హౌస్ అరెస్టులు, ఒక్క టీడీపీ కార్యకర్తను రోడ్డు మీదకు రానివ్వలేదు
- మరి, వైసీపీ వారు నిరసన పిలుపిస్తే, వారికి రాచ బాట వేశారు
- యథేచ్ఛగా రోడ్ మీదకొచ్చారు, ఊరేగింపులు తీస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రవర్తిస్తోన్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాము నిరసన తెలిపితే అరెస్టులు చేస్తున్నారని, అదే సమయంలో వైసీపీ నిరసనలు తెలిపితే మాత్రం వారిని ఏమీ అనకుండా వదిలేస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.
'డీజీపీ గారూ.. ఏమిటి ఈ వివక్ష? టీడీపీ బంద్ పిలుపిస్తే అడుగడుగునా ఆంక్షలు, హౌస్ అరెస్టులు, ఒక్క టీడీపీ కార్యకర్తను రోడ్డు మీదకు రానివ్వలేదు. మరి, వైసీపీ వారు నిరసన పిలుపిస్తే, వారికి రాచబాట వేశారు, యథేచ్ఛగా రోడ్ మీదకొచ్చారు, ఊరేగింపులు తీస్తున్నారు, నల్లజెండాల ప్రదర్శన చేస్తున్నారు' అని వర్ల రామయ్య విమర్శించారు.