రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల సంయమనం పాటించండి: డీజీపీ గౌతమ్ సవాంగ్
- రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు
- టీడీపీ, వైసీపీ మధ్య భగ్గుమన్న రాజకీయాలు
- ప్రకటన జారీ చేసిన డీజీపీ కార్యాలయం
- చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరిక
- దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్న డీజీపీ
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజా పరిణామాల నేపథ్యంలో స్పందించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశానికి గురికాకుండా సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించరాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొనసాగించడంలో ప్రజలు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.