హృదయం నిర్మలంగా ఉంటే పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి: సంచయిత
- విజయనగరంలో సిరిమానోత్సవం
- ఆహ్వానం అందలేదన్న సంచయిత
- అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్ష
- ట్విట్టర్ లో స్పందన
విజయనగరంలో ప్రతి ఏడాది నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి తనను ఆహ్వానించలేదని చెబుతున్న మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతి ట్విట్టర్ లో స్పందించారు. ఈ సిరిమానోత్సవం రోజున పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అభిలషించారు. మన హృదయం నిర్మలంగా ఉంటే అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
గతేడాది మాన్సాస్ చైర్ పర్సన్ హోదాలో దసరా సిరిమానోత్సవానికి హాజరైన సంచయితకు ఈసారి ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల కోర్టు తీర్పుతో సంచయిత మాన్సాస్ చైర్ పర్సన్ బాధ్యతల నుంచి తప్పుకోగా, ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వైభవంగా నిర్వహించే సిరిమానోత్సవానికి గజపతిరాజుల వంశీకులు హాజరవడం ఆనవాయితీగా వస్తోంది.