టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ కు మరో విజయం

  • పాపువా న్యూ గినియాపై 17 రన్స్ తేడాతో విక్టరీ
  • తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 రన్స్
  • 19.3 ఓవర్లలో 148 పరుగులకు పాపువా ఆలౌట్
  • జోష్ డేవీకి 4 వికెట్లు
యూఏఈ, ఒమన్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు షాకిచ్చిన స్కాట్లాండ్... నేడు పాపువా న్యూ గినియా జట్టుతో జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో నెగ్గింది.

అల్ అమేరత్ మైదానంలో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాపువా న్యూ గినియా జట్టు 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో నార్మన్ వనువా అత్యధికంగా 476 పరుగులు చేయగా, సెసె బావు 24 పరుగులు నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో రాణించాడు.

ఇక, నేడు జరిగే రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ఒమన్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన బంగ్లాదేశ్ నేటి మ్యాచ్ లో గెలవాలని కృతనిశ్చయంతో ఉంది.


More Telugu News