ప్రభాస్ చేతుల మీదుగా 'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్!

  • ఆకాశ్ పూరి నుంచి 'రొమాంటిక్'
  • తెలుగులో కేతిక శర్మ తొలి సినిమా
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ
  • ఈ నెల 29వ తేదీన విడుదల  
ఆకాశ్ పూరి కథానాయకుడిగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, తెలుగు తెరకి కేతిక శర్మ కథానాయికగా పరిచయమవుతోంది. చాలాకాలం క్రితమే ఈ సినిమా విడుదలకి ముస్తాబైనా, పరిస్థితులు అనుకూలించకపోవడం వలన ఆగుతూ వచ్చారు.

ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో, ప్రమోషన్ల వేగం పెంచారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ తో కూడిన ఈ ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమా రొమాంటిక్ గా ఉండనుందనే విషయం, ఈ ట్రైలర్ తో అర్థమైపోతోంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. ''చాలామంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ .. కానీ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు" అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 


More Telugu News